తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో ఘనముగా జరిగిన గుడ్ ఫ్రైడే దండయాత్ర
ఈ సువార్త దండయాత్ర కార్యక్రమంలో పాస్టర్ డేవిడ్ మాట్లాడుతూ మొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అని తెలియపరచి క్రీస్తుమన పాపమునిమిత్తము మృతి పొందెనని, సమాధి చేయబడేనని, మూడవ దినమున లేపబడేనని అందరూ సహోదర ప్రేమ కలిగి ఉండాలని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని తోటి వారికి సహాయపడే వారిగా ఉండాలని జైళ్లలో ఉన్నవారికి హాస్పటల్లో అనారోగ్యంగా ఉన్నవారికీ అనాధలుగా ఉన్నవారికి నిరాశ్రయులుగా ఉన్న వారికి సహాయం చేసేవారిగా ఉండాలని ఆపదల్లో ఆదుకునే వారిగా ఉండాలని అలాగున సహాయము చేస్తే నాకు చేసినట్లే అని క్రీస్తు తన బోధలలో తెలియపరిచారని తన సందేశంలో తెలియపరిచారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎం, గాబ్రియల్ రెవరెండ్ ఎం షకీనా బాబు రెవరెండ్ ఏలియా రెవరెండ్ కె, ఆనంద్ కుమార్ రెవరెండ్ ఎన్, ఆనందరావు రెవరెండ్ ఎన్, కృపావరం పాస్టర్ పరంజ్యోతి పాస్టర్ కే, జానాక్స్ పాస్టర్ ఎన్, సామ్యూల్ పాల్ బ్రదర్ జైపాల్ సిస్టర్ విజయప్రసన్న వై, రాజు అన్ని సంఘాల విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.