జీలుగుమిల్లి లో ఘనంగా జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం
NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను
ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు తరువాత గ్రామంలో ఉన్న భక్తులకు, స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం జీలుగుమిల్లి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము ఇంటి వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు పాల్గొని, అన్నదాన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ – “గ్రామాల అభివృద్ధితో పాటు, సాంప్రదాయాలు, ఆచారాలు, దేవతల పట్ల భక్తి భావనతో జరిగే ఈ విధమైన సేవా కార్యక్రమాలు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తాయి. భక్తులందరితో కలిసి ముత్యాలమ్మ అమ్మవారి సేవలో పాల్గొనడం నాకు గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రెసిడెంట్ సంకవల్లి సాయి, జనసేన సీనియర్ నాయకులు చిర్రి శ్రీను, పసుపులేటి ప్రసాద్, గౌడ సంఘ పెద్దలు ఉలవల ముత్యం, కొప్పుల వెంకటేశ్వరరావు, కొప్పుల దుర్గారావు, నారగాని బుజ్జి,గ్రామ పెద్దలు, యువత, మహిళలు, స్థానిక నాయకులు, కూటమి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













