నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాల లో తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను కోలాహలంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ పూల జాతరన పల్లె జీవితానికి అద్దపట్టేలా ఉంటుందని ప్రకృతిని పూజించడంలో తెలంగాణ ముందుంటుందని , రైతు తన పంట ఇంటికొచ్చే సమయంలో పల్లె పదాలతోటి రామాయణ మహాభారత కథల తోటి పాటలు పాడుకుంటూ ప్రకృతిని పూజించుకుంటూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అడ్డం పట్టేలా క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో బతుకమ్మ పండుగ ప్రారంభం అయిందని విద్యార్థులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు కాపాడే విధంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి, పాఠశాల ఏవో పోల గోవర్ధన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Leave a Reply