చిట్యాల లో తప్పిన పెను ప్రమాదం
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పోలీసు స్టేషన్ ఎదురుగా తృటిలో పెను ప్రమాదం తపింది. చిట్యాల పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కూడలి లో ద్విచక్ర వాహనం రోడ్ దాటుతుండగా విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ వారిని తప్పించే ప్రయత్నంలో ఎదురుగా ఉన్న డివైడర్ కు డీకొట్టింది . ఆ సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ద్విచక్రంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గత రెండు రోజులుగా జాతీయ రహదారిపై కూడలిలో భారీకేట్లు తీసివేయడంతో ఈ ప్రమాదానికి కారణమని వెంటనే భారీకెట్లను ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.