రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.

Spread the love

రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.

NTODAY NEWS:- రిపోర్టర్ కూనురు మధు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎల్లి కట్టే గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. చిట్యాల ఏఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాలు ప్రకారం కట్టంగూర్ మండలం ఇస్మాయిల్ పల్లి గ్రామానికి చెందిన మాద నరసింహ(50)తండ్రి బాలయ్య, అతను ఈ నెల 10 గురువారం రోజున సెంట్రింగ్ పనిలో భాగంగా మునుగోడుకు తన మోటార్ సైకిల్ పై వెళ్లి తిరుగు ప్రయాణంలో సాయంత్రం నార్కట్పల్లి కి వస్తుండగా మార్గమధ్యంలో చిట్యాల మండల పరిధిలోని ఎలికట్టే గ్రామ శివారులో అశోక్ ల్యాండ్ గూడ్స్ క్యారియర్ వెహికల్ డ్రైవర్ అతివేగంగా ప్రయాణిస్తూ మాద నరసింహ నడుపుతున్న సైకిల్ మోటార్ ను ఢీకొట్టడంతో నరసింహకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కొరకు హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో చేర్పించారు. నరసింహ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లుగా మృతుని కుమారుడు హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటయ్య తెలిపారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »