పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని వినాయకునికి వినతి పత్రం అందజేత
NTODAY NEWS: నల్గొండ జిల్లా,
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని వినాయకుడికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబివిపి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు కొంపల్లి సూర్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఇవ్వవలసిన సుమారు ₹8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు. యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సకాలంలో సర్టిఫికెట్లు అందకపోవడంతో కౌన్సిలింగ్‌లకు హాజరు కాలేక అనేక మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబివిపి నాయకులు వంగూరి గణేష్, సందీప్ వర్మ , మధు , సంపత్ , ఆదిత్య , ప్రవీణ్, శివ తదితరులు పాల్గొన్నారు.













