చోరీ కేసులో నిందితుల అరెస్ట్
NTODAY NEWS: ప్రతినిధి బోరా శివ రెడ్డి.
చందుర్తి జంక్షన్ వద్ద జరిగిన చోరీ కేసులో నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శనివారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ జి. శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. గత నెల 28న రాజమహేంద్రవరంలోనీ భవాని సిల్వర్ గుమస్తాగా పనిచేస్తున్న సమీర్ భవాని సిల్వర్ ప్రజా పట్ తన మోటార్ సైకిల్ పై పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు లోని దుకాణాల నుంచి రాత్రి 8 గంటలకు బంగారం, వెండి, డబ్బులు, తీసుకొని చందుర్తి బయలుదేరాడు. మార్గం మధ్యలో నలుగురు వ్యక్తులు సమీర్ ప్రజాపత్ ని బ్లేడ్ తో బెదిరించి వెండి, రూ 60 వేలు నగదు దోచుకుని పోయారు. దీంతో అతను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు సిఐ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రైమ్టీంతో పాటు, ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఫుటేజ్ తీసి, సెల్ టవర్ సిగ్నల్స్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కనుగొన్న సెల్ నెంబర్ రాజమహేంద్రవరం భవాని సిల్వర్ లో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా అతని ద్వారా అదే షాప్ లో చేశారన్నారు. దొంగలించిన బంగారం, వెండి, నగదును నిందితులు సామర్లకోట జల్లూరు మధ్యలో గ్రామ చివరన ఒక పాడుబడ్డ పాకలో ఉంచి శనివారం వాటిని పంచుకుంటుండగా నిందితులు రౌతు, గోవిందు, గనిరెడ్డి సాయి ప్రసాద్, కోన సాయిబాబు, బొమ్మను విజయ్ ఆనంద్, కుక్కల శివ మణికంఠలను పోలీసులు ఆరెస్టు చేశారు. వారి నుంచి 18. 50 లక్షల విలువచేసే బంగారం, వెండి, నగదును, రెండు మోటార్ సైకిల్ ను, 5 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు. సీఐ జి. శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో గొల్లప్రోలు, పిఠాపురం, యు. కొత్తపల్లి ఎస్ ఐలు ఎన్. రామ కృష్ణ, మణికుమార్, జాన్ బాషా వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు.

