బొమ్మలరామారం మండలంలో పరిమితికి మించి జిలెటిన్ స్టిక్స్ వాడుతూ హై బ్లాస్టింగ్ చేస్తున్న స్టోన్ క్రషర్ల మీద కేసులు నమోదు చేయాలని ప్రజా పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొమ్మలరామారం ఎస్ఐ శ్రీశైలంకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీస శ్రీనివాస్, మైలారం జంగయ్య మాట్లాడుతూ క్వారీల్లో వాడే పేలుడు పదార్థాలకు లెక్కుకు మించి వాడుతున్నందున వారి మీద పరిశీలన చేసి కేసులు నమోదు చేయాలని కోరారు.బ్లాస్టింగ్ ఎక్కువ మోతాదులో చేయడం వల్ల రాయి దుమ్ము గ్రామాలను అంధకారంలో ముంచెత్తుతున్నాయని,మందు గుండు వాసనకు ఊపిరి ఆడటం లేదని తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అసలు బ్లాస్టింగ్ అనుమతులు ఎంతవరకున్నాయో తనిఖీ చేయాలని, అప్పుడు వారి అసలు బాగోతం బయటపడుతుందన్నారు.అతి భారీ బ్లాస్టింగ్ బారినుండి ప్రజలను కాపాడాలని కోరారు. అధిక లోడుతో లారీలు మూలమలుపుల వద్ద కంకర కింద పడడంతో వాహనదారులు కింద పడుతున్నారు,రాళ్ళు ఎగిరి తలలకు తగులుతున్నాయని క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వట్టిపల్లి సుదర్శన్,సహాయ కార్యదర్శి మైలారం సుదర్శన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
