స్టేడియం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించండి

Spread the love

హిందూ వైకుంఠధామనికి మరియు మినీ స్టేడియం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించండి.. ఆకుల సతీష్

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో హిందువుల కోసం గతంలో కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం 10 ఎకరాలు వైకుంఠధామం కోసం సర్వే నెంబర్ 186 లో మరియు 5 లక్షల జనాభా క్రీడలు, శారీరిక దృఢత్వం కోసం 5 ఎకరాల స్థలం మినీ స్టేడియం కోసం సర్వేనెంబర్ 186/334 కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ నీజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో మూడు లక్షల హిందూ జనాభా గలిగిన నిజాంపేట్ కార్పొరేషన్ నందు నిజాంపేట్ ,బాచుపల్లి, ప్రగతి నగర్ మూడు గ్రామాలకు కలిపి వైకుంఠధామం 10 ఎకరాల స్థలం కేటాయిస్తూ 2017లో అప్పటి కలెక్టర్ ఎం.వి.రెడ్డి కేటాయించడం (Proce No:LC/565/2017)జరిగింది. 10 ఎకరాలు నందు కనీసం ఒక ఎకరం స్థలంతో కూడా వైకుంఠధామం ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. మళ్లీ ఇందులో కేటాయించిన 10 ఎకరాల వైకుంఠధామ స్థలంలో ముస్లిం(3.0ac) క్రిస్టియన్(3.20AC) హిందువులకు(3.20Ac) కేటాయిస్తూ ఆర్డిఓ మల్లయ్య 2020లో ఉత్తర్వులు (Lr.No.B/129/2020) ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు హిందువులకు వైకుంఠధామం కోసం ఒక ఎకరం కూడా కేటాయించకపోవడం బాధాకరం. 2023 సంవత్సరంలో ముస్లిం మతస్తుల (ఈద్గా)కోసం 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటివరకు హిందువుల వైకుంఠధామం కోసం ఎలాంటి స్థలం కేటాయించకపోవడం అధికారులకు హిందువులన్న& హిందూ ధర్మం పట్ల చిన్నచూపుగా కనిపిస్తుంది. కావున హిందువుల వైకుంఠధామం కోసం 2020 ఆర్డిఓ ఉత్తర్వుల ప్రకారం 10/3.20 ఎకరాలు స్థలం వైకుంఠధామం కోసం సర్వే నెంబర్ 186 లో తక్షణమే కేటాయించాలనీ ఐదు లక్షల జనాభా గలిగిన నిజాంపేట్ కార్పొరేషన్ లో పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి మరియు క్రీడల అభివృద్ధి కోసం సర్వే నెంబర్ 186 కానీ సర్వే నెంబర్ 334లో గాని 5 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని గతంలోనే పలుమార్లు కలెక్టర్కి ఫిర్యాదు ఫిర్యాదు చేయడం జరిగిందని. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం తక్షణమే హిందూ వైకుంఠధామం మరియు మినీ స్టేడియం కోసం క్షేత్రస్థాయిలో మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం కేటాయించడానికి తగిన ఉత్తర్వులు తయారుచేసి, కేటాయింపులు చేయాలని రెవెన్యూ అధికారులకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఎల్ల స్వామి, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »