ప్రమాదలకు అడ్డాగ రోడ్లపై వడ్ల కల్లాలు ??? అవగాహన లేక అరబోస్తున్న రైతులు “””
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్
★★నియోజకవర్గంలొ ప్రధాన రహదారులఫైనే ధాన్యం రాసులు
★★సగం రోడ్డును ఆక్రమించి
అరబోస్తున్న వైనం??
★★వాహన రాకపోకలకు అంతరాయము. ప్రయాణికులకు ఇకట్లు””
★★ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేకె అరబోస్తున్నారా??
★★ జరగరని ప్రమాదం జరిగితే బాద్యులు ఎవరూ.. రైతుల?? ప్రభుత్వమా??
★★వ్యవసాయ అధికారులు స్పందించి తాగు జాగ్రత్తలు చేపట్టాలని వాహన దారుల డిమాండ్
అరుగలం కష్టపడిన రైతుకు అడుగడుగునా అవరోదలే వెంటాడుతున్నాయి.నారు పోసినప్పటి నుండీ పంట చేతుకు వచ్చే వరకు తరువాత ఆ పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించే వరకు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. యూరియా కష్టాలు ఎదురుకొని పంటను కాపాడుకున్న రైతులు అకాల వర్షంతో ఇబ్బందులు ఎదురుకున్నారు ఇప్పుడు తడిసిన పంటను అరబోయ్యడానికి గ్రామాల్లో సరయిన విదంగా కొనుగోలు కేంద్రాల్లో కల్లాలను ఏర్పాట్లు చెయ్యకపోవడంతో మెజారిటీ రైతులు ప్రధాన రహదరులనే తమ కల్లాలుగా మార్చుకొని వడ్లను రోడ్లపై అరబోస్తున్నారు.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలుగా రైతు వేదికలు. ప్రభుత్వ స్థలలో ఏర్పాటు చెయ్యగ. వాటిలో అధికామొత్తంలొ రైతులు వడ్లను అరబోసుకోవడనికి వీలు లేదు.దీని వలనే రోడ్లను కల్లాలుగా మార్చుకుంటున్నారని సమాచారం..దీనితో వచ్చే పోయే వాహనాలకు త్రివ్రమైన అంతరాయము ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది..అందుకు నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిప్ చెడ్. హత్నూర మండలాల్లో గల జోగిపేట నర్సాపూర్ రహదారిపై సగానికి పైగా రోడ్డుపై రైతులు అరబోసిన వడ్ల ధాన్యం రాసులే నిదర్శనం……
(సగం రోడ్డును ఆక్రమించి అరబోసిన ధాన్యం) “””
చిలిప్ చెడ్. హత్నూర మండలల్ల పరదిలోని జోగిపేట నర్సాపూర్ అలాగే జోగిపేట కౌడిపల్లి వెళ్లే రహదారుల మీదా రోడ్డును ఆక్రమించి వడ్లను అరబోసరూ రైతులు… దీనితో అటువైపువెళ్లే వాహన దారులు త్రివ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. సగానికిపైగా రోడ్డుపై దాన్యన్ని అరబోయ్యడంతో ఏదురేదురుగా వచ్చే వాహనాలు డి కొనే ప్రమాదం ఉంది..చీకట్లో వెళ్లే వారు అదమరచి వెళితే వారు అనంతలోకాలకే అన్నట్లు పరిస్థితి మారింది… కొనుగోలు కేంద్రాలలో సరయినా సదుపాయాలను ఏర్పాటు చెయ్యక పోవడంతో తమకు ఉన్న ఒకే ఒక్క ఆధారం రహదారులని అందుకే రోడ్లపై వడ్లను అరబోస్తున్నాం అని రైతులు చెపుతున్నారు.. వచ్చేది సీతకాలం కావడంతో పూర్తిగా పొగ మంచు కప్పుకొని చలి తీవ్రత పెరిగి రోడ్లు కనిపించక ప్రమాదాలు మరింత తీవ్రతరం అవుతాయని చెప్పానక్కర్లేదు..అయితే రోడ్లపై ధాన్యం అరబోయ్యడంతో రాకపోకలకు అంతరాయము కలుగుతుందని వాహనదారులు రైతులతో వాగ్వదనికి దిగుతున్నా పరిస్థితి నియోజకవర్గంలొ ఏర్పడింది…
(వ్యవసాయ అధికారులు స్పంచించాలి :వాహనదారులు)
వాహన దారుల పడుతున్న ఇబ్బందులపై వాహనదారులతో NTODAY న్యూస్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ రీపోటర్ లక్ష్మి ప్రసాద్ మాట్లాడగ. ఇప్పటికైనా ఇ సమస్య పై వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకి సరయినా సదుపాయాలను కల్పించాలి.. ఇ విషయంలొ రైతులను తప్పుగా చూబెట్టలేము కాబట్టి వారికీ విశాలమైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని.. రోడ్లను ఆశ్రయించకుండా తాగు చర్యలు చేపట్టాలని వాహనదారులు అలాగే ప్రయాణికులు.. ప్రభుత్వన్ని వ్యవసాయ అధికారులను కోరుతున్నారు..రైతులకు ఇ విషయంపై పూర్తి స్థాయిలో గ్రామాల్లో అవగాహనా కార్యక్రమలు చేపట్టాలని..రోడ్లపై ధాన్యం అరబోయడం ద్వారా ఇప్పటికే జరిగిన ప్రమాదల గురించి.. జరగబోయే ప్రమాదలపై అవగాహనా కల్పిస్తే ప్రమాదాలు నివారించవచ్చు అని తెలిపారు .. ఇటీవలా కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదలను దృష్టిలో ఉంచుకొని వెంటనే రోడ్డుపై ఉన్న ధాన్యం రాసులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.. చూడాలి వ్యవసాయ అధికారులు ఇ విషయం పట్ల స్పందిస్తారో లేదో…













