తొలిఏకాదశి సందర్భంగా ముత్యాలమ్మతల్లి ఆలయంలో ఆషాఢమాసం పూజలు నిర్వహించడం జరిగింది
NTODAY NEWS (రిపోర్టర్ వీరమల్ల శ్రీను)
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో ఈరోజు శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మతల్లి ఆలయంలో ఆషాఢమాసం తొలిఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని ఊరికి ఆడబిడ్డగ భావించి అమ్మవారికి చీరలు, సారెగా 108 రకాల పిండి వంటకాలు ప్రసాదంగా భక్తులు తేవటం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు వారి మొక్కులు చెల్లించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు వారికి, వారి కుటుంబానికి కలగాలని కోరుకన్నారు. గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించూసుకొని గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకున్నారు.

