ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా భువనగిరి పట్టణ ప్రజలకు పర్యావరణం పై అవగాహన కార్యక్రమం
NTODAY NEWS: భువనగిరి పట్టణం, జూన్ 05
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 4వ రోజు అయినందున మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆధ్వర్యంలో ఉదయం 7.30 ని.కు పట్టణంలోనీ స్థానిక గాంధీ పార్క్ నుండి మొదలుకొని హన్మన్ వాడ వరకు స్వచ్ఛ్ వాక్ (ర్యాలీ) నిర్వహించి పట్టణ ప్రజలందరికీ పర్యావరణం పై, తడి చెత్త పొడి చెత్త పై, ప్లాస్టిక్ వ్యర్ధాలపై అవగాహన కల్పిస్తూ, స్థానిక హనుమాన్ వాడ దేవాలయం వద్ద మానవహారం నిర్వహించి అధికారులు సిబ్బంది మరియు ప్రజలందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఆ తదుపరి అక్కడే నివాసం ఉంటున్న గృహ నివాస ప్రజలందరికీ కూడా ఇట్టి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. మరియు వీటన్నిటితోపాటు ప్రతిరోజు పట్టణంలోని అన్ని వార్డులలో 18 పారిశుద్ధ్య వాహనాలకు ఉన్నటువంటి మైక్ సెట్స్ ద్వారా ఆడియో అనౌన్స్మెంట్ కూడా వినిపించడం జరిగుతందని, ప్రజలందరూ కూడ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తడి పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ తదుపరి స్థానిక కేంద్రీయ విద్యాలయం వద్ద సుమారు 500 మొక్కలతో వన మహోత్సవం పేరిట మొక్కలు నాటు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ తదుపరి అమృత్ మిత్ర (ప్రతి మహిళకు ఒక చెట్టు) స్కీం క్రింద మహిళా సంఘాలు మరియు మెప్మా సిబ్బంది ద్వారా స్థానిక చెరువు కట్ట వద్ద గల 14 ఎకరాల స్థలంలో మొక్కలు నాటు కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సహాయక ఇంజనీర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్, వార్డు అధికారులు, రిసోర్స్ పర్సన్, సిబ్బంది, ప్రజలు మరియు కేంద్రీయ విద్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.