జూన్ 3 నుంచి భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు
( NTODAY NEWS) జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై మండలంలోని 16 గ్రామాలలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ అవగాహన సదస్సులు చిట్యాల మండల పరిధిలో ఉన్న 16 గ్రామ పంచాయతీలలో జూన్ 3 నుండి జూన్ 12 వరకు వివిధ గ్రామాలలో భూభారతి చట్టంపై రైతులకు రెవెన్యూ శాఖా పరంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కృష్ణ నాయక్ తెలిపారు. 3న పెద్దకాపర్తి, వట్టిమర్తి, 4న ఏపూరు, వనిపాకల, 5న పేరేపల్లి, ఉరుమడ్ల, 6న చిన్నకాపర్తి, తాళ్ల వెల్లంల, 9న గుండ్రాంపల్లి, ఎలికట్టే, 10న సుంకెనెపల్లి, నేరడ, 11న పిట్టంపల్లి, శివనేనిగూడెం, 12న వెలిమినేడు, చిట్యాలలో సదస్సులు ఉంటాయని అన్నారు. ఈ అవగాహన సదస్సులకు టీం లీడర్లుగా చిట్యాల తాసిల్దార్ కృష్ణా నాయక్, బి విజయ ఉంటున్నట్లు తెలియజేశారు.