భూభారతి చట్టం ప్రతి పేదవారి ఇంటికి చుట్టం

Spread the love

భూభారతి చట్టం ప్రతి పేదవారి ఇంటికి చుట్టం –రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి, జిల్లా తుర్కపల్లి మండలం

పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలనే ఆశయంతో అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రోజు తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణి కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి అర్హులకు ఇండ్ల పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు వాసాలమర్రి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండగా ఉంటుందని దానికి అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి చిరకాల చిన్న కోరిక ఇల్లు కట్టుకోవాలని కోరికతో ఉన్నట్టువంటి నిరుపేదలు ఎంతమంది ఉన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఆశయంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాసాలమర్రి గ్రామంలో మొదటి లబ్ధిదారు ఆగవ్వకు ఇందిరమ్మ ఇంటి పత్రం,ఒక లక్ష రూపాయల చెక్కును మంత్రి అందజేశారు.ఆనాటి పాలనలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తామని చెప్పి చేయలేక పోయిన అభివృద్ధి పనులను ఇందిరమ్మ హయాంలో వాసాలమర్రి గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. పేదవారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతి పేదవారికి 200 యూనిట్ ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్,మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం, పేదవారికి జబ్బు వస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు నాణ్యమైన వైద్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి పేదవారు కడుపునిండా అన్నం తినాలని దృఢ సంకల్పము తో ప్రభుత్వం ప్రతి పేదవానికి సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మెస్ చార్జీలు 40 శాతం పెంచడం జరిగిందని, ఆడపిల్లలకు కాస్మొటిక్ చార్జెస్ పెంచడం జరిగిందన్నారు. ప్రతి పేద వారి కళ నెరవేరాలని నాలుగున్నర లక్షల ఇల్లు మొదట విడుదల ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి 4 విడతలుగా మొదటిగా పునాది వేయడంతో లక్ష రూపాయలు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, స్లాబ్ లెవల్ కట్టడం లోపే మరో లక్ష రూపాయలు జమ చేయడం జరుగుతుందని, స్లాబ్ వేయడంతోనే రెండు లక్షలు జమ చేయడం జరుగుతుందని, ఇల్లు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల వరకు ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వం విడతల వారీగా ఇవ్వడం జరుగుతుందన్నారు . ధరణి ద్వారా రైతుల భూసమస్యలు పరిష్కారం కానందున, ప్రభుత్వం ప్రతి రైతుకు న్యాయం చేయాలనే ఆలోచనలతో కొత్త చట్టం భూభారతి 2025 ద్వారా ప్రతి పేద వారి భూ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. భూభారతి చట్టం ప్రతి పేదవారి ఇంటికి చుట్టం అని అన్నారు. రెండు విడతలలో పైలెట్ ప్రాజెక్టుగా రెండు మండలాలలో చేసి మూడవ విడతగా జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వచ్చి భూ సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరిస్తున్నారని తెలిపారు. మండలాలలో సర్వేయర్లు తక్కువ ఉన్నందున ప్రభుత్వం ఒక పటిష్టమైన వ్యవస్థ చేయాలనే ఆలోచనలతో సర్వేయర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. పేదవారికి ఏ ఆపద వచ్చిన ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేయడం జరుగుతుందని భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం మంత్రి భువనగిరి మండలంలోని బండ సోమారం గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన గ్రామంలో పూర్తి కావస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పేదవారి సొంతింటి కల నెరవేర్చాలని ఆకాంక్షతో ప్రభుత్వం వాసాల మర్రి గ్రామాన్ని దత్తత తీసుకొని అర్హులందరికీ ఇండ్లు కట్టించాలని గొప్ప ఆలోచన చేసి వాసాలమర్రి గ్రామంలో అర్హులకు ఇండ్ల పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. వాసాలమర్రి గ్రామంలో ఇండ్లు లేని వారికి అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేసుకుంటూ ప్రభుత్వం అన్ని విధాలుగా సంక్షేమంలో ముందుకు పోతుందన్నారు. ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం మహిళలకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలనే దృడ సంకల్పంతో ప్రభుత్వం మహిళల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వాసాలమర్రి గ్రామంలో అర్హులైన పేదవారికి ఇండ్ల పత్రాలు పంపిణీ చేయడం ప్రజా పాలనకు ఒక నిదర్శనం అని అన్నారు. ధనిక, పేద కుటుంబానికి అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు పారదర్శకంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకోకపోతే వారి చేత దరఖాస్తు పెట్టించి ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టుకునేలా చూడాలన్నారు.ప్రతి పేద వారు కడుపునిండా అన్నం తినాలని కోరికతో ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.వానాకాలం పంట సాగు కింద రైతు భరోసా కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆలేరు ప్రజలకు ఒక గొప్ప వరంగా ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు ఇవ్వడం ఒక అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రైతుల పంట సాగుకు రైతన్న సాగు నీరు కోసం ప్రభుత్వం ఆలేరు రైతుల కోసం ఎన్నో నిధులు మంజూరి చేయడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులు మూడు నెలల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టడం పూర్తి చేసుకొని తోరణాలు కట్టి ఒక పండుగ వాతావరణంతో ఇందిరమ్మ ఇంట్లోకి వెళ్లాలన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంత రావు మాట్లడుతూ అర్హులైన పేద వారందరికీ పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో ఇందిరమ్మ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల చొప్పున నాలుగు విడతలుగా మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.ఇండ్లు కట్టుకునే ప్రతి పేద వారు తొందరగా బేస్మెంట్ పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల సహాయం పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు చైతన్య మహేందర్ రెడ్డి, రేఖ బాబురావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »