కదిరిలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం
NTODAY NEWS
రిపోర్టర్ – వినోద్ కుమార్
శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి లో ఎన్ జి ఓ ఫంక్షన్ హాల్ నందు భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సామాల కేశవరెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశము జరిగినది.
ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమార స్వామి హాజరై రైతులకు సంబంధించిన చాలా విషయాలు విశ్లేషించి రైతుల అభ్యున్నతికి బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను రైతులకు వివరిస్తూ వారిని కిసాన్ మోర్చా లోకి ఆహ్వానించాలని, ప్రతి గ్రామం నుంచి కనీసం ఇరబై మంది రైతులతో కమిటీలు వేయాలని, రైతుకు ఎలాంటి కష్టమొచ్చినా బిజెపి కిసాన్ మోర్చా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కదిరి మాజీ శాసనసభ్యులు ఎం ఎస్ పార్థసారథి , కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు చింతా శరత్ కుమార్ రెడ్డి , కిసాన్ మోర్చా రాయలసీమ ఇంచార్జ్ శ్రీ చంద్రశేఖర్ గారు, కిసాన్ మోర్చా ఆర్గానిక్ రీసెర్చ్ కో కన్వీనర్ సామాల ప్రకాష్ నాయుడు కౌలు రైతుల రాష్ట్ర కన్వీనర్ కసెట్టి రామమోహన్ , కదిరి పట్టణ అధ్యక్షులు పీట్ల రామక్రిష్ణ , ఓ బి సి మోర్చా జిల్లా అధ్యక్షులు హసనాపురం చంటి , యస్ టి మోర్చా జిల్లా అధ్యక్షులు మూడే ఆనంద్ నాయక్ , దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు ఆనంద్ , మైనారిటీ మొర్చా జిల్లా అధ్యక్షులు బార్ ఇంతియాజ్ గారు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి షేక్ సమివుల్లా , జిల్లా మాజీ ఉపాధ్యక్షులు డి ఎల్ ఆంజనేయులు , సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి , కృష్ణవేణమ్మ , పట్టణ ఉపాధ్యక్షురాలు పఠాన్ రీహానా , జిల్లా వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.