మల్యాల మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన బొమ్మలరామారం మండల తాహసిల్దార్

Spread the love

మల్యాల మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన బొమ్మలరామారం మండల తాహసిల్దార్ పి. శ్రీనివాసరావు

NTODAY NEWS: బొమ్మలరామారం.

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బొమ్మలరామారం మండల తాహ సిల్దార్ పి. శ్రీనివాసరావు అన్నారు. హాస్టల్ నిద్ర పోగ్రాంలో భాగంగా శుక్రవారం రోజున బొమ్మలరామారం మండలం, మల్యాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్ ను మండల తాహసిల్దార్ తనిఖీ చేశారు. స్కూల్లో ఉన్న స్టోర్ రూమ్,కిచెన్ రూమ్ ను తనిఖీ చేసి భోజన నాణ్యత పరిశీలించారు మెనూ ప్రకారం వండిన ఆహారాన్ని పరిశీలించి విద్యార్థులకి వడ్డించారు.రోజు మీకు అందించే ఆహారం ఎలా ఉందని రుచికరంగా ఉంటుందా లేదా అని, విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. స్కూల్ లో విద్యార్థులు సంఖ్య ఎంత ఉందని, ఎంత మంది టీచర్స్ ఉన్నారని, అందరూ వస్తున్నారా అని ఆరా తీశారు.ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉందని, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, మంచి ఆహారం పెడుతున్నాం అని గ్రామాలలో తెలియపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »