CM రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన బిఆర్ఎస్ నాయకులు శంబిపూర్ కృష్ణ
అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎం రిలీఫ్ ఫండ్ ను ఉపయోగించుకోవాలని బి ఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ శంబిపూర్ కృష్ణ అన్నారు. ఈరోజు శంభీపూర్ లో mlc శంభీపూర్ రాజు మంజూరు చేయించిన రూ.4,55,500/- సిఎం రిలీఫ్ ఫండ్ సంబంధిత 16 చెక్కులను బాధితులకు అందజేశారు శంభీపూర్ నివాసులు అర్కల శ్రీదేవి కి ప్లాస్టిక్ సర్జరీ కొరకు మంజూరు చేయించిన Rs.75,000 నిమ్స్ ఎల్ఓసిని లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జక్కుల శ్రీనివాస్ యాదవ్, సుధాకర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, డైరెక్టర్ అర్కల జీతయ్య, మునిసిపల్ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ శమీర్పేట్ రంగయ్య, నాయకులు ఆకుల బాబు, తిరుమలేష్, అర్కల సురేష్, BRSV కొర్ర ప్రవీణ్ నాయక్, నరసింహ రెడ్డి, మహేష్, మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
