రక్తసంబంధాలు మరిచి అన్నను హత్య చేసిన తమ్ముడు,మెదక్ జిల్లాలో దారుణ హత్య
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
అన్నదమ్ముల ప్రేమానురాగాలు వైదొలుగుతున్నాయి అన్నకీ ఏదయినా జరిగితే తమ్ముడు, తమ్ముడికి ఏదయినా జరిగితే అన్న ఒకరినీఒకరు రామ లక్ష్మణుడిలా ఉండాల్సింది పోయి భూమి కోసం తండ్రి ఆస్తులకోసం ఒకరినీఒకరు హత్యలు చేసుకుంటున్నారు మనీషన్న వాడు మాయమై పోతున్నాడు. మానవ సంబంధలు మరిచి ఒకరిని ఒకరు కొట్టుకు చస్తున్నారు ఇలాంటి సంఘటననే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా, కొల్చారం మండల్ అంస్సాన్ పల్లి గ్రామంలోని కల్లు డిపో వద్ద చోటు చేసుకుంది శుక్రవారం మధ్యాహ్నం సమయంలొ అంస్సాన్ పల్లి వసురం తాండకు చెందిన రామావత్ మంఖ్య (వయసు 45) ను అతని సోదరుడు మోహన్ఫ.. గ్రామంలొని కల్లు డిపో వద్ద అతి కిరతకంగా మద్యం మత్తులో కల్లు సీసాతో మేడపైన పొడిచి చేతి రూమల్ తో ఊరి వేసి హత్య చేసాడు వీరి ఇద్దరి మధ్య ట్రాక్టర్ అద్దె డబ్బుల విషయంలొ గొడవ జరిగింది అని స్థానికులు తెలియజేసారు మరిన్ని వివరాలు తెలియల్సివుంది.

