BREAKING
అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు
www.ntodaynews.com

మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు....

తెలంగాణ
05 Apr, 2025 - 09:15 AM
350 వీక్షణలు
స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు.... సర్పంచ్ మీనుగ లలితమ్మ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఆధ్వర్యంలో..... (కూడేరు) ఏప్రిల్ 5-Ntoday News స్థానిక కూడేరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణ నందు భారతదేశం మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు కూడేరులో సర్పంచ్ మీనుగు లలిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయం,హక్కుల కోసం ఐక్య ఉద్యమాలకు ఎంతో ఆయన శ్రమించడం జరిగిందని తెలియజేశారు మొదటగా బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ కాలంలో అంటరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు.స్వాతంత్రానంతరం సమానత్వం,సామాజిక న్యాయం,హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు.ఆయన ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలన్నారు.నేటికీ సామాజిక న్యాయం,హక్కులు,చట్టాలు అట్టడుగువర్గాలకు అందలేదని,బాబు జగ్జీవన్ రామ్ చూపిన బాటలో సమానత్వం కోసం పోరాడాలన్నారు.ప్రపంచీకరణ,ప్రైవేటీకరణ,సరళీకరణ పేరుతో పాలకుల అవలంబిస్తున్న విధానాల వల్ల రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు.దళిత,గిరిజన,బలహీన వర్గాలు ఏకమై హక్కుల సాధనకై పోరాడాలన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర కాలంలో,స్వతంత్ర అనంతరం కూడా బడుగు బలహీన వర్గాలకోసం కృషి చేసారన్నారు.దోపిడీ,పీడన అంతం అయ్యేంతవరకు ఆయన స్ఫూర్తితో అందరం పోరాడాలన్నారు.ఈ కార్యక్రమంలో కూడేరు గ్రామపంచాయతీ సర్పంచ్ లలితమ్మ, ఎంపీటీసీ భర్త తోపుదుర్తి రామాంజనేయులు, రామదుర్గం కిష్టప్ప, శంకర్ నాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మన్న, సర్పంచ్ భర్త చిన్న ఈశ్వరయ్య, ఎడమల ఈశ్వరయ్య, మాల మహానాడు మండల అధ్యక్షుడు పరమేష్ విహెచ్పిఎస్ నాయకులు కలగళ్ల ముత్యాలు, జల్లిపల్లి వెంకటేశులు, వివిధ గ్రామాలకు చెందిన దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.... Follow us on Website Facebook Instagram YouTube