సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన దేవరకొండ సుదర్శన్ కు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని కార్పోరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించడంలో సహాయపడుతుందని పేదల ఆరోగ్య విషయంలో ఆర్థిక సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందని అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆపదలో మెరుగైన వైద్యం కోసం పేద ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆవుల సుందర్, మెట్టు వెంకటేశం యాదవ్, గంధం రాజ్ కుమార్, గురిజ యాదగిరి, దేశపాక మధు, పోలిమర పరమేష్, గంగాదేవి నరసింహ, పచ్చిపాల శంకర్, ముక్కాముల యాదయ్య ,బూడిది సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.