సీగాచి పరిశ్రమ ప్రమాద బాధతులకు పరిహారం త్వరగా విడుదల చెయ్యాలి..
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్, నియోజకవర్గ ప్రతినిధి
••బాధితులకు పరిహారం ఇవ్వకుంటే కలెక్టరేట్ ముందే టెంట్ వేసి దీక్ష చేస్తాం.
••పరిహారం వారానికి ఇస్తారా.పది రోజులకి ఇస్తారా?
••స్పష్టమైన తేదీ చెప్పండి.. లేదంటే ఉద్యమం ఉదృతం చేస్తాం.. మాజీ మంత్రి హరీష్ రావు
••ప్రమాదంలొ మరణించిన వారికీ కోటి రూపాయలు.
••తీవ్రంగా గాయపడిన వారికీ 50లక్షల పరిహారం చెల్లించాలి. MLAలు సునీతా లక్ష్మరెడ్డి. చింత ప్రభాకర్..
సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు.జూన్ 30వతేదీ పటాన్ చేరు పాశమైలారం పరిశ్రమిక వాడలొ సీగాచి ఫార్మ కంపెనీలో రియాక్టర్ పేలుడులొ స్తంభించిన భారీ అగ్ని ప్రమాదంలొ, మరణించిన వారికీ ఒక కోటి రూపాయల చొప్పున, గాయపడిన వారికీ 50లక్షల రూపాయల పరిహారన్ని అందించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలతో కలసి వినతిపత్రం అందజేశారు. ఒక వారం రోజుల్లో చెల్లిస్తారా లేక పది రోజుల్లో చెల్లిస్తారా అనే విషయాన్ని స్పష్టమైన తేదీతో ప్రకటించాలని లేకుంటే కలెక్టర్ కార్యలయం ముందరనే బాధితులతో కలసి టెంట్ వేసుకొని దీక్షను కొనసాగిస్తాం అని మాజీ మంత్రి సిద్ధిపేట MLA హరీష్ రావు పేర్కొన్నారు ప్రభుత్వం ఇకనైనా బాధితులను పట్టించుకోక పొతే ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దల్చేల చేస్తాం అని ఏద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలొ నర్సాపూర్ MLA సునీతా లక్ష్మరెడ్డి, సంగారెడ్డి MLA చింత ప్రభాకర్, జహీరాబాద్ MLA మాణిక్యరావు మరియు బి.ఆర్.యస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

