జగ్గయ్యపేటలో గణేశ్ ఉత్సవాలపై సమన్వయ సమావేశం
NTODAY NEWS:జగ్గయ్యపేట
అన్ని మతాల మత పెద్దల సమక్షంలో అధికారులు సూచనలు
జగ్గయ్యపేట : పట్టణంలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జగ్గయ్యపేట సుభమస్తు కళ్యాణ మండపంలో సోమవారం సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్. రాఘవేంద్ర అధ్యక్షత వహించారు. ఎంవీడీఓ, ఎంఆర్ఓ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొని, ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హిందూ చైతన్య వేదిక సభ్యులు, శాంతి కమిటీ ప్రతి నిధులతో పాటు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల మత పెద్దలుహాజరై సామాజిక సౌహార్దతకు నిదర్శనంగా నిలిచారు.గణేశ్ ఉత్సవాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకలు” అని మత పెద్దలు పేర్కొన్నారు. పోలీస్ శాఖ తరఫున సీఐ వెంకటేశ్వర్లు ఎస్సై రాజు తదితరులు హాజరై మాట్లాడారు. నిమజ్జనాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై పూర్తి స్థాయి చర్యలు చేపడ తామని హామీ ఇచ్చారు. పోలీస్ విభాగం, మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ఆర్. రాఘవేంద్ర మాట్లాడుతూ, “గణేశ్ ఉత్సవాలు పట్టణ సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకలు. ప్రజల సహకారంతో ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తాం. అన్ని కమిటీలు నిబంధనలు పాటిస్తూ ముందుకు రావాలి” అని తెలిపారు. ముఖ్య నిర్ణయాలు విద్యుత్ సరఫరా నిరంతరంగా కొన సాగించేందుకు ప్రత్యేక చర్యలు. నిమజ్జనాల కోసం ప్రత్యేక మార్గాలను గుర్తించడం. అగ్నిమాపక శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు ఉత్సవాల నిర్వహణలో ప్రతి కమిటీ పూర్తి సహకారం. ఈ కార్యక్రమంలో వివిధ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.













