ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

Spread the love

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా…

నాడు అన్న‌దాత‌ల‌ను న‌ట్టేట ముంచిన వైసీపీ ప్ర‌భుత్వం రైతులపై జగన్‌ది కపట ప్రేమ
జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటెల బాలాజి

చిల‌క‌లూరిపేట‌: నాడు వ్య‌వ‌సాయ రంగాన్ని, అన్న‌దాత‌ల‌ను న‌ట్టేట ముంచి నేడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌ రైతుల‌పై క‌ప‌ట ప్రేమ చూపుతున్నార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటెల బాలాజి చెప్పారు. మంగ‌ళ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మ‌వేశంలో బాలాజి మాట్లాడుతూ జ‌గ‌న్ పాల‌న కాలంలో రైతులు ఎన్ని ర‌కాలుగా ఇబ్బందులు ప‌డ్డారో తెలుస‌న్నారు. నాడు సీఎంగా జగన్ అనాలోచిత నిర్ణయాలు, విధానాలతో రాష్ట్ర రైతులు కోలుకోలేని విధంగా దెబ్బ‌తిన్నార‌ని గుర్తు చేశారు. వ్యవసాయరంగం, రైతుల్ని ఆదుకోవడంలో సీఎం జగన్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయాడని ఎద్దేవా చేశారు. గ‌తంలో జ‌రిగిన విష‌యాలు మ‌ర్చిపోయి ఉంటార‌ని భావించి కొత్త పంథాలో రైతుల‌ను మ‌భ్య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే విమ‌ర్శ‌లు..
రాష్ట్రంలో తుఫాన్లు, వరదలు వచ్చిన సమయంలో వైసీపీ కనీసం రైతుల గురించి ఆలోచించలేదని, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ బయటకు వస్తే పరదాల చాటున దాక్కున్న విష‌యం ప్ర‌జ‌లు మ‌రిచిపోలేద‌ని బాలాజి గుర్తు చేశారు. ఉల్లి రైతులకు రూ. 1200 క్వింటా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయడమేకాక హెక్టార్‌కు రూ. 50 వేలు సాయం ప్రకటించిందని గుర్తు చేశారు. పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలను మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు గురించి మాట్లాడటం, అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి నిమిత్తం వారికి రవాణ సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అధికారులను ప్రభుత్వం ఆదేశిందని చెప్పారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు, మ‌న్న‌న‌లు పొందుతున్న కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను చూపి వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల్లో మ‌ద్ద‌తు కొల్పోయి దిక్కుతోచని జగన్‌ ప్రజల దృష్టిని మరల్చేందుకు కూట‌మి ప్ర‌భుత్వం పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »