గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టులో భాగమైన కెనాల్ బండ్ ప్లాంటింగ్ కు రాష్ట్రంలోమొట్టమొదటిసారిగా బాంబుసా తుల్డా అనే అరుదైన వెదురు జాతి పెంపకం
NTODAY NEWS: గొల్లప్రోలు మండల్ ప్రతినిథి భోర శివారెడ్డి
ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కు సంబంధించి ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ , రాజమండ్రి నందు DF0 శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి , ప్రాజెక్టులో భాగమైన కెనాల్ బండ్ ప్లాంటింగ్ పై చర్చించి , ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వినియోగంలోకి తీసుకు వస్తున్న బాంబుసా తుల్డా అనే అరుదైన వెదురు జాతిని కెనాల్స్ పై పెంచాలని , నాటిన నాలుగో ఏడాది నుంచి ప్రతి ఏడాది 40 సంవత్సరాల వరకు ఆదాయం ఇస్తుంది అని , నీటి సంఘాలకు ప్రతి ఏడాది ఆదాయం లభిస్తుందని గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ , వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కోటిపల్లి డిసి విజయ గోపాల రాజు , కాజులూరు డిసి లాకాని కృష్ణ చైతన్య , సిరిపురం డిసి పేపకాయల నారాయణరావు , ఎర్రపోతవరం డిసి సుబ్రహ్మణ్యేశ్వర చౌదరి , ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

