రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు
NTODAY NEWS: రిపోర్టర్ (వీరమల్ల శ్రీను)
ఏలూరు జిల్లా/ జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద దేవీ నవరాత్రులు మరియు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఏడవ రోజు అమ్మవారు మహాచండీ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన చీరలు, పిండి వంటలు నైవేద్యంగా భక్తులు తేవడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు గ్రామంలోని వారికి కలిగి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే బతుకమ్మ పండగ ఎనిమిదోవ రోజు సందర్భంగా గ్రామంలోని మహిళలు పాల్గొని పూలతో బతుకమ్మను అలంకరించి తెచ్చి ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, పెద్దలు భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.













