అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై అసంతృప్తి
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం, జూన్ 02.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర అమరవీరుల కుటుంబాల కమిటీ జిల్లా కన్వీనర్ బర్రె సుదర్శన్, కో- కన్వీనర్ కొడారి వెంకటేష్ లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవిర్భావ ఉత్సవ వేడుకల్లో తెలంగాణ సిద్ధాంతకర్త, మూడు తరాల తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి కొత్తపల్లి జయశంకర్ సార్ ఫోటోను ఉత్సవాల్లో ఏర్పాటు చేయకపోవడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన, అమరవీరుల కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులను గౌరవించకపోవడం చాలా విచారకరమని వారన్నారు. అలాగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే విద్యార్థులు ఎండలో ప్రదర్శనలు చేయడం కొంత అసంతృప్తి కలిగించిందని వారు తెలిపారు.