సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు పొందిన ఉపాధ్యాయురాలును అభినందించిన జిల్లా కలెక్టర్
NTODAY NEWS: ఏలూరు
ఏలూరు నెల ట్యాల్ మేగజైన్ మరియు పింక్ , బేటి బచావో బేటి పడావో మరికొన్ని సంయుక్త నిర్వహణలో జరిగిన సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు” పొందిన ఉపాధ్యాయురాలు నీలిమ ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అభినందించారు.దక్షిణ భారతదేశంలో ఉన్న మహిళల కోసం ఇచ్చే ఈ అవార్డులో ఆంధ్ర రాష్ట్రం నుంచి నీలిమ ఎంపిక అవడం జరిగింది. కళా సాంస్కృతిక రంగంలో ఆమెకు ఈ అవార్డును ఇచ్చారు. ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, గాయకురాలిగా, రచయితగా సాంస్కృతిక సేవ చేస్తూ మరియు జానపద నృత్య విభాగంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో బహుమతులు గెలుచుకునే లాగా తర్ఫీదుని ఇవ్వడం మొదలైన కార్యక్రమాలు చేస్తూ ఉండటం వలన ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు కోసం మొత్తం ఐదు దశలు ఉండగా కేవలం నాలుగవ దశలోనే నీలిమని ఎంపిక చేయటం జరిగింది. ఈ అవార్డును గౌరవ ఏలూరు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా నీలిమ అందుకోవడం జరిగింది. యిటువంటి విజయాలను మరిన్ని సాధించాలని సాధించాలని గౌరవ జిల్లా కలెక్టర్ అభినందించారు. స్త్రీ సాధికారతను సమాజం గుర్తించాలన్నారు.

