బొమ్మలరామారం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
NTODAY NEWS: బొమ్మలరామారం
నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శుక్రవారం రోజున బొమ్మలరామారం మండలంలోని రంగాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు
గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని,అవి ఏ ఏ దశలలో ఉన్నాయని ఎంపీడీఓ ని అడిగి తెలుసుకున్నారు.ఇంటి నిర్మాణానికి మేస్త్రీలకు ఎక్కువ రేట్లు ఇవ్వకుండా చూడాలని స్థానిక ఎంపిడిఓ,తహసీల్దార్ లు కట్టడి చేయాలని అన్నారు.ఇంటి నిర్మాణాలకు మేస్త్రీలకు ఎక్కువ రేటు ఇవ్వకూడదన్నారు.నిర్మాణ పనులు పూర్తి అయినంత వరకు బిల్లు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణా పనులు జరిగినంతవరకు లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు అందరూ త్వరగా ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకొని దసరా పండగ కి గృహప్రవేశం చేసుకోవాలి అని సూచించారు.అనంతరం భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారని,ఎన్ని పెండింగ్ లో ఉన్నాయని, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు,క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను తహసీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే,అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. అనంతరం ఎంపిడిఓ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ కోసం ముందస్తుగానే అవసరమైన జాబితాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎస్.ఐ.ఆర్ ను పకడ్బందీగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తాహ సిల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో రాజా త్రివిక్రమ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.













