జడ్.పి.హెచ్.ఎస్ ఎఫ్ఏసి హెచ్ఎమ్ అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు

Spread the love

జడ్.పి.హెచ్.ఎస్ ఎఫ్ఏసి హెచ్ఎమ్ అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు

NTODAY NEWS:చిట్యాల

చిట్యాల జెడ్పిహెచ్ఎస్ ఎఫ్ఏసీ హెచ్ఎం గా విధులు నిర్వర్తించిన గోగికారి మాధవి పై వచ్చిన అవినీతి ఆరోపణల మీద సోమవారం విద్యాశాఖ అధికారులు విచారణ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ యోగేంద్రనాథ్, చిట్యాల మండల విద్యాధికారి సైదా నాయక్ ఆధ్వర్యంలో విచారణ చేశారు. విచారణలో భాగంగా వారు పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఎఫ్ఎసి హెచ్ఎం గా విధులు నిర్వర్తించిన సమయంలో మాధవి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పీఎం శ్రీ నిధుల గోల్మాల్, అనుమతి లేకుండా పాఠశాలలో చెట్లు నరికివేత, పాఠశాలలోని ఫర్నిచర్ ను విక్రయించడం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇష్టానుసారంగా పాఠశాలకు గైర్వాజర్ కావడం వంటి ఆరోపణలు చేస్తూ విద్యార్థి సంఘాల నిరసనలు, మీడియా ప్రత్యేక కథనాలు వెలువడడంతో విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు విచారణ నిర్వహించారు. సోమవారం ఆమె పాఠశాలకు గైర్వాజర్ కావడంతో మరుసటి రోజు ఆమెను కూడా విచారణ చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »