శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలోకదిరి కొండ చుట్టూ ఆక్రమణలను తొలగించి శ్రీ వారి భక్తులకు గిరి ప్రదక్షిణకు రహదారి ఏర్పాటు చెయ్యాలని కోరుకుంటూ కదిరి రెవెన్యూ అధికారికి విశ్వ హిందూ పరిషత్ తరుపున వినతిపత్రం.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి కదిరి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కుమ్మర వాండ్లపల్లి గ్రామంలో కొండల లక్ష్మీ నరసింహ స్వామి వారు చెంచు లక్ష్మీ సమేతంగా వెలసారని అందుకే ఈ క్షేత్రానికి “ఖాద్రీ పురం” అనే పేరు వచ్చిందని భక్తులు విశ్వసిస్తారు.అందులో భాగంగానే శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి” జన్మించిన జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున పెద్దయెత్తున శ్రీవారి భక్తులు కదిరి కొండకు ఖాద్రీ కొండకి “గిరిప్రదక్షిణ” చేస్తున్నారు. కావున మీరు హిందువుల మనోభాలను పరిగణనలోకి తీసుకొని కదిరి కొండ చుట్టూ ఆక్రమణలను తొలగించాలని ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని , గిరిప్రదక్షిణకు అనుకూలంగా రహదారికి ఏర్పాటు చెయ్యాలని కోరుకుంటూ కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారికి శ్రీ వారి భక్తుల తరపున మరియు “విశ్వహిందూ పరిషత్” సభ్యులు తరపున వినతిపత్రం అందించడం జరిగింది.