పెట్రోల్ పోసుకున్న బాధిత రైతు భూమిని పరిశీలించిన మండల తాహసిల్దార్, హద్దులు చూపలేకపోయినా బాధితుడు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం
నాగినేనిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోగల సర్వే నెంబర్ లు 340,345, 346లో తడకపల్లి ఆగి రెడ్డి తన పేరున ఉన్న రెండు ఎకరాల 22 గుంటల భూమి ఇతరుల పేరు మీద అధికారులు మార్పిడి చేశారని తనకు న్యాయం జరగడం లేదని ఆవేదనతో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బాదిత రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు మండల తహశీల్దార్ పి.శ్రీనివాసరావు నాగినేనిపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో గల భూమిని మంగళవారం రోజున మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసలతో కలిసి పరిశీలించారు. బాధిత రైతుకు గతంలో అమ్మిన రైతును మోకాపై తీసుకెళ్లిన తన భూమి హద్దులను సరిగా గుర్తించడం లేదని తెలిసింది. ఈ మేరకు తన భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను కోరినట్లు తెలిసింది బాధిత రైతు విన్నపం మేరకు సర్వే నెంబర్లలో గల రైతులకు నోటీసులు జారీ చేసి భూమిని సర్వే చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

