ఏలూరు నగరాన్ని పచ్చదనంతో హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పిలుపునిచ్చారు.
పర్యావరణం-పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం పోణంగి డంపింగ్ యార్డ్ కాంపౌండ్ లోపల రోడ్డుకు పక్కగా ఉన్న ప్రాంతంలో అడవిల (ఫారెస్ట్) తయారు చేసే విధంగా మొక్కలు నాటారు, అనంతరం టిట్కో ఇల్లు ప్రాంతంలో రోడ్డు పక్కనే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు అన్నారు.
ఏలూరు నగరంలో 10 వేలు మొక్కలు నాటడానికి మేయర్ సారధ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రణాళికలు సిద్ధం చేశారు అన్నారు. మొక్కలు ఉండడం వలన ఆక్సిజన్ వ్యాప్తి చెందుతుందన్నారు మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ.శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశాలతో కార్పొరేషన్ పరిధిలో 10 వేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 5 వేల డ్వాక్రా గ్రూపులు ఒక్కొక్క మొక్కనాటి వాటి పరిరక్షణ వారే చూసుకునే విధంగా మెప్మా వారి ద్వారా చర్యలు తీసుకున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు ఈడ చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్,మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, స్థానిక కార్పొరేటర్ దారపు అనూష తేజ,ఇంచార్జ్ కమిషనర్ జి.చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి,ఎం.ఈ ఈ.సురేంద్రబాబు.పలువురు కార్పొరేటర్లు పాల్గొని మొక్కలు నాటారు.