చిట్యాల లో పల దుకాణాలకు జరిమానాలు
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను ఆదేశాల మేరకు చిట్యాల పట్టణంలోని పలు షాపులను తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా నిషేధిత ప్లాస్టిక్ ను వాడుతున్న పలు షాపులకు జరిమానాలు విధించారు నిషేధిత ప్లాస్టిక్ ను వాడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ సిబ్బంది పలు షాపులకు హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రవణ్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.