నాగినేనిపల్లి గ్రామ ప్రజలకు అండగా మాజీ సర్పంచ్ బట్కీర్ బీరప్ప
NTODAY NEWS: బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామ ప్రజలకు ఆపద వస్తే అండగా ఉంటూ తనకు తోచిన సహాయం చేస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని నాగినేనిపల్లి గ్రామపంచాయతీ మాజీ వార్డ్ మెంబర్ మోత్కుపల్లి మహేందర్ అన్నారు ఎస్సీ కాలనీలో గత వారం రోజులు క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన బొమ్మగల బాలమ్మ కుటుంబాన్ని మాజీ సర్పంచ్ బీరప్ప పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం చేశారు అని తెలిపారు మాజీ సర్పంచ్ కి వారి కుటుంబం తరపున మాఎస్సీ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి రమేష్, కొమ్ము నగేష్, బాబు, బొమ్మగల స్వామి, మహేందర్, ఎల్లయ్య, మడుగుల నరసింహ, ఆవుల కృష్ణ, సంఘీ దర్శన్ తదితరులు పాల్గొన్నారు.

