నాలుగు వరుసల వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు

Spread the love

నాలుగు వరుసల వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు

NTODAY NEWS: ఏలూరు, మే – 15

అభివృద్ధి, సంక్షేమ నిధులను దారి మళ్ళింపచేసిన గత వైసిపి ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్ధసారధి మండిపడ్డారు. ఏలూరు జ్యూట్‌మిల్‌ జంక్షన్‌ సమీపంలో మున్సిపల్‌ డిపాజిట్‌ ఇఎస్‌సిసిఎల్‌ ఫండ్స్‌ 5కోట్ల రూపాయల నిధులతో కృష్ణ – ఏలూరు కాలువపై నూతనంగా నిర్మించనున్న నాలుగు వరుసల వంతెన నిర్మాణ పనులకు రాష్ట్ర సమచార, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్ధసారధి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలు శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత శంకుస్థాపనా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధికి, ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏలూరు ఎంపి పుట్టా, ఎమ్మెల్యే బడేటి చంటిలు చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. గత వైసిపి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలనలో ఏలూరు ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైసిపి పాలకులు, ప్రజాప్రతినిధులు ఏలూరు స్మార్ట్‌ సిటి నిధులను సైతం దారి మళ్ళించి బ్రిడ్జి నిర్మాణాన్ని ఆలస్యం చేసేందుకు కారణమయ్యారని మండిపడ్డారు. తమకు నచ్చిందే ప్రజలకు నచ్చాలనే అహంకార పూరిత ఆలోచనతో గత వైసిపి ప్రభుత్వం పనిచేస్తే ప్రజల మన్ననలు పొందే విధంగా కూటమి ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. కూటమి ప్రభుత్వ ఆలోచనా విధానానికి అందరూ పూర్తిస్థాయిలో సహకారం అందించాలన్నారు. అలాగే ఏలూరు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు వద్ద తలెత్తిన సమస్య విషయంలో కూడా ఎమ్మెల్యే చంటి సమయస్ఫూర్తితో స్పందించారని మంత్రి కొలుసు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 5కోట్ల రూపాయలతో చేపట్టనున్న బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని గత వైసిపి ప్రభుత్వ పాలకులు కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టేశారని మండిపడ్డారు. అందరి సహకారంతో తిరిగి బ్రిడ్జి నిర్మాణానికి తాను చర్యలు తీసుకున్నానన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ విషయంలో జెడ్‌ స్పీడ్‌తో ముందుకెళ్తోందన్న ఆయన వ్యత్యాసాలకు పోకుండా కూటమి నాయకులంతా అభివృద్ధిలో భాగస్వాములవ్వడం శుభపరిణామమని చెప్పారు. నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగర అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే బడేటి చంటి చూపుతున్న చొరవ ప్రశంసనీయమన్నారు. గతంలో కొన్ని కారణాల వలన వాయిదా పడిన నాలుగు వరుసల బ్రిడ్జి నిర్మాణం కూటమి ప్రభుత్వ పాలకుల చర్యలతో కార్యరూపం దాల్చనుందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపిఎస్‌ ఆర్టీసి విజయవాడ జోన్‌ – 2 ఛైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆలోచనల్ని బలంగా ముందుకు తీసుకెళ్తోన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తొలుత అధికారులు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన బ్లూప్రింట్‌ మ్యాప్‌ను ఎమ్మెల్యే చంటికి వివరించారు. కార్యక్రమంలో ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఏలూరు ఎఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్ధసారధి, డిప్యూటి మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవనీ, బిఎస్‌ఎన్‌ఎల్‌ అడ్వైజరీ కమిటి సభ్యులు లంకపల్లి మాణిక్యాలరావు, కో – ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్‌ పెదబాబు, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ పూజారి నిరంజన్‌, ఏలూరు ఆర్డీవో అచ్యుత్‌ అంబరీష్‌, నాయకులు బెల్లపుకొండ కిషోర్‌, వందనాల శ్రీనివాస్‌, ఆర్నేపల్లి తిరుపతి, ఆర్‌ఎన్‌ఆర్‌ నాగేశ్వరరావు, దాకారపు రాజేశ్వరరావు, గూడవల్లి వాసు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top