గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దంపతులు
N TODAY NEWS: యాదగిరిగుట్ట జూన్ 08
తెలంగాణ రాష్ట్ర ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం కొండ చుట్టూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వారి సతీమణి అనిత గిరిప్రదక్షిణ లో పాల్గొన్నారు.శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి స్వాతి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం రోజున ఉదయం యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం, ఆలయ అధికారులు స్వామి ప్రసాదాన్ని అందజేశారు.కాగా ఈ గిరిప్రదక్షిణ లో వేలది మంది భక్తులు పాల్గొన్నారు.