రజాకార్లను ఎదిరించి పోరాడిన గ్రామం గుండ్రాంపల్లి

Spread the love

రజాకార్లను ఎదిరించి పోరాడిన గ్రామం గుండ్రాంపల్లి

NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు

తెలంగాణ సాయుధ పోరాటం లో గుండ్రాంపల్లి పై ప్రత్యేక కథనం,

1947 ఆగస్టు 15 న భారతదేశానికి బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి స్వేచ్ఛ వాయువును పీల్చిన రోజు కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మాత్రం విముక్తి కలగలేదు తెలంగాణ ప్రాంతంలోని నిజాం నిరంకుశ పాలనలో భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రాంతం పోరాటం చేస్తుంది. 1940 నుండి 1951 వరకు తెలంగాణ సాయుధ పోరాటం నిర్విరామంగా సాగింది. ఈ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లాలోని చిట్యాల మండల పరిధిలో ఉన్న గుండ్రాంపల్లి గ్రామానికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. నిజాం నిరంకుశ పాలనను ధైర్యంగా ఎదిరించిన గ్రామాలలో గుండ్రంపల్లి ఒకటి. 1948 వ సంవత్సరంలో నల్లగొండ జిల్లాలో రజాకార్ల ఆగడాలు మితిమీరి పోయాయి. ఈ తరుణంలో రజాకార్ల నాయకుడు కాశీం రిజ్వీ అనుచరుడైన మక్బూల్ అలీ సూర్యాపేట జిల్లా వర్ధమానుకోట నుండి గుండ్రంపల్లి వలస వచ్చి గ్రామంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. మక్బూల్ అలీ ఆనాటి మజ్లిస్ సంస్థలో చేరి రజాకారుల దళ నాయకుడిగా ఎదిగాడు. చిట్యాల మండలంలోని 50 మందితో రజాకారుల సైన్యాన్ని ఏర్పరచుకొని అరాచకాలకు తెగబడ్డాడు. నల్లగొండ జిల్లాలోని చిట్యాల, పెద్ద కాపర్తి, చిన్న కాపర్తి, పలివెల, ఏపూర్, సుంకనపల్లి, రెడ్డిబావి గ్రామాలలో రజాకారుల తో అరాచకాలను తీవ్రతరం చేశాడు పలు గ్రామాలలో ఇండ్లలోకి చొరబడి దోచుకోవడం , ఎదురు తిరిగిన వాడిని కర్కశంగా నరికి చంపేయడం వంటి దురాగతాలకు పాల్పడ్డాడు. ఈ అరాచకాలు ఎంతవరకు మితిమీరాయంటే ఇద్దరు గర్భిణులను చంపి పునాదిలో పాతిపెట్టే వంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు అతని అరాచకాలు దారుణంగా తయారయ్యాయి, మక్బూల్ అలీ అరాచకాలకు వ్యతిరేకంగా గుండ్రంపల్లి లోని యువకులు కమ్యూనిస్టు పార్టీతో కలసి అతనిపై కాల్పులు జరపగా మక్బుల్ అలీ భార్య, కూతురు చనిపోయారు. భార్య, కూతురు చనిపోవడంతో మక్బూల్ అలీ రజాకారుల సైన్యాన్ని పెంచుకొని గుండ్రంపల్లి పరిసర ప్రాంతాలలో ఉన్న గ్రామాలలో అతని ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఎదురొచ్చిన 350 మంది నిర్దాక్షిణ్యంగా చంపి గుండ్రంపల్లి బావిలో వేశాడు. ఆడవాళ్లపై అత్యాచారాలు చేసి చంపేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ఈ అరాచకాలు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గుండ్రంపల్లి మరియు పరిసర గ్రామాలలో ఉన్న యువకులు నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో ఉన్న రజాకారుల స్థావరాలపై దాడి రజాకార్లను చంపేశారు. ఈ ఘటనతో తెలంగాణ వ్యాప్తంగా సాయిధ రైతంగా పోరాటం ఉవ్వెత్తున ఎగిసి పడింది. కమ్యూనిస్టు పార్టీ చేసే ఎదురు దాడులకు తట్టుకోలేక 1949 జూలై 19న గ్రామాన్ని విడిచి మక్బూల్ అలీ పారిపోయాడు. అదే తరుణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ పాలిస్తున్న నిజాం రాజ్యంపై (ఆపరేషన్ పోలో) పోలీస్ చర్యకు పూనుకున్నాడు ఈ పోలీస్ చర్య 1949 సెప్టెంబర్ 12న మొదలైంది. 5 రోజులపాటు నిర్విదామంగా రజాకారులకు భారత సైనిక దళాలకు మధ్య యుద్ధం ఉధృతం కావడంతో ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెప్టెంబర్ 17న భారత మిలిటరీ దళాలకు లొంగిపోయి హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్ లో కలుపుతున్నట్టు రేడియోలో ప్రకటించాడు. ఈ ప్రకటనతో హైదరాబాద్ రాష్ట్రం నిజాం బానిస సంఖ్యల నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చింది. 1992లో రజాకారుల చేతిలో చనిపోయిన అమరవీరులను చంపిన బావి దగ్గర వారికి గుర్తుగా స్మారక స్థూపాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించి గుర్తు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక దినోత్సవాలు జరుపుతున్నారు. ఈ అమరవీరులను త్యాగం మరువలేనిదని గుర్తుంచుకోవాలి.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »