పారిశ్యుద్ద్య కార్మికులకు హెల్త్ క్యాంప్
NTODAY NEWS
రిపోర్టర్ కూనూరు మధు
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ పరిధిలో 100 రోజు ప్రణాళికలో భాగంగా 8వ రోజు సోమవారం రోజున చిట్యాల పురపాలక కమిషనర్ దండు శ్రీను ఆధ్వర్యంలో చిట్యాల పురపాలక సంఘ పారిశ్యుద్ద్య సిబ్బందికి హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు వివిధ పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో Dr.సత్యానరేష్, సిహెచ్ఓ నర్సింగ్ రావు, ఆరోగ్య కార్యకర్తలు సరళ, పుష్ప, ఆశా కార్యకర్తలు గీత, కవిత లు మునిసిపల్ సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి R.ధనలక్మి , మెప్మా TMC – N సరిత ,ఇన్ చార్జి సానిటరీ ఇన్ స్పెక్టర్ M.శ్రవణ్ కుమార్ , వార్డు అధికారులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ పెద్దలు,మహిళ సంఘాల వారు, కార్యాలయ సిబ్బంది,మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.