BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

మార్నింగ్ వాకింగ్‌తో ఆరోగ్యం

తెలంగాణ
09 Mar, 2026 - 08:46 AM
165 వీక్షణలు
మార్నింగ్ వాకింగ్‌తో ఆరోగ్యం – పరిశుభ్రతతో రోగాలకు చెక్ వన్ కే రన్‌ను ప్రారంభించిన చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత NTODAY NEWS: చిట్యాల ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే మార్నింగ్ వాకింగ్‌ను అలవాటు చేసుకోవాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని హైస్కూల్ సమీపంలోని వనిపాకల రోడ్డులో సోమవారం నిర్వహించిన వన్ కే రన్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలిలో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం మార్నింగ్ వాకింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను కూడా నివారించవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మూడో వార్డులో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మూడో వార్డు వనిపాకల రోడ్డునుంచి శ్రీరామ్ నగర్ కాలనీ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు తన బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కమిషనర్ దండు శ్రీను, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. #Chityal #MorningWalk #1KRun #CleanTown #PublicHealth #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube