ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడతారు. అయితే కొందరికి టికెట్ తీసుకున్న తర్వాత రైలు మిస్ అవుతుంటుంది. అలాంటి సమయంలో వారిలో ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ట్రైన్స్ బస్సులలాగా కాదు ఎప్పుడు పడితే అప్పుడు ఉండడానికి. రైళ్లు సమయానుకూలంగా ఉంటాయి. మరో బెంగ ఏంటంటే రైలు టికెట్ తిసుకున్న తర్వాత ట్రైన్ మిస్ అయితే..
ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడతారు. అయితే కొందరికి టికెట్ తీసుకున్న తర్వాత రైలు మిస్ అవుతుంటుంది. అలాంటి సమయంలో వారిలో ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ట్రైన్స్ బస్సులలాగా కాదు ఎప్పుడు పడితే అప్పుడు ఉండడానికి. రైళ్లు సమయానుకూలంగా ఉంటాయి. మరో బెంగ ఏంటంటే రైలు టికెట్ తిసుకున్న తర్వాత ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌పై వేరే ట్రైన్ ఎక్కచ్చా? లేదా? అనేది. చాలా మంది ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకోవడం లేదా ఇంట్లో ముఖ్యమైన పని కారణంగా ఎక్కాల్సిన రైలును మిస్ అవుతుంటారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు ప్రయాణికులు రైలు ఎక్కలేకపోతున్నారు. రైలు తప్పిపోయిన తర్వాత మనం ఉన్న టికెట్‌పై తదుపరి రైలులో ఎక్కగలమా అనే ఒకే ఒక్క ప్రశ్న ప్రతి ఒక్కరిలో వస్తుంది. లేదంటే మళ్లీ కొత్త టికెట్ కొనాల్సి ఉంటుందా?
మీరు రైలును మిస్ అయితే, మీరు అదే టిక్కెట్‌తో తదుపరి రైలులో ప్రయాణించగలరా లేదా అనేది మీరు కలిగి ఉన్న టికెట్ తరగతిపై ఆధారపడి ఉంటుంది. భారతీయ రైల్వే టిక్కెట్లు వారు బుక్ చేసిన రైలు, ప్రయాణ తరగతికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అంటే ప్రత్యేక రైలు టిక్కెట్టును మరో రైలు ఎక్కేందుకు ఉపయోగించలేరు. అయితే, ‘తత్కాల్’ టిక్కెట్లు, ‘ప్రీమియం తత్కాల్’ టిక్కెట్లు కలిగి ఉన్న ప్రయాణీకులు అదే రోజు కొన్ని షరతులకు లోబడి మరొక రైలులో ఎక్కేందుకు అనుమతిస్తారు. మీ వద్ద సాధారణ టిక్కెట్ ఉంటే, మొదటి రైలు తప్పిపోయిన తర్వాత, అదే టిక్కెట్‌తో తదుపరి ప్యాసింజర్ రైలులో ప్రయాణించవచ్చు.
Leave a Reply