పేదలకు అండగా ఇందిరమ్మ పాలన–ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్ 10
పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన మన రాష్ట్రంలో కొనసాగుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు సోమవారం రోజున బొమ్మలరామారం తహశీల్ధార్ కార్యాలయ ప్రాంగణంలో మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు 445 మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం మంజూరు పత్రాలను అందజేశారు అనంతరం 164 మంది లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నిరుపేద అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తామని అన్నారు ప్రభుత్వ పథకాలను చివరి ఇంటికి చేరేవరకు పార్టీలకతీతంగా అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు వచ్చే నెలలో మండలంలో ఇంకా 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు మంజూరు పత్రాలు ఎవరైతే తీసుకున్నారో వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు పైరవీలకు తావు లేదు ఎవరైనా డబ్బులు అడుగుతే వెంటనే నాదృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో నాలుగు దశల్లో డబ్బులు అందుతాయని అన్నారు మనది ప్రజా ప్రభుత్వం నేను నాయకుడిగా కాకుండా సేవకుడిగా పని చేస్తానని అన్నారు తుర్కపల్లి మండలం, తిరుమలపురం గ్రామంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతం కావడానికి నియోజవర్గంలోని ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలల కృషి ఎంతో ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో రాజా త్రివిక్రమ్, ఎంపీఓ శాలిని, హౌసింగ్ డిఈ రాములు, ఏఈ ప్రశాంత్, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్, పిఎసిఎస్ చైర్మన్ గూదే బాల్ నరసింహ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు నాయక్, బొమ్మలరామారం మాజీ సర్పంచ్ రాంపల్లి మహేష్ గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామిడి రామ్ రెడ్డి, బిట్టు శ్రీనివాస్, మర్రి భగవంతు రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు సునీత,వట్టిపల్లి సుదర్శన్, చీర సత్యనారాయణ, కవిత వెంకటేష్ గౌడ్, భోగ కల్పన వెంకటేష్, మంత్రాల శ్రీహరి, బీఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.