జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు పాలాభిషేకం చేసిన ఇందిరానగర్ వాసులు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డు ఆరెగూడెం మరియు ఇందిరానగర్ కాలనీకి సంబంధించిన రేషన్ షాప్ నెంబర్ 4408002 ఆరెగూడెంలో కలదు. కానీ ఇందిరానగర్ నుండి ఆరెగూడెంకు ప్రతినెల రేషన్ సరుకుల కోసం వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు ద్విచక్ర వాహనాలు లేని నిరుపేదలు చేతికి ఎదిగిన పిల్లలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని
కావున ఇందిరానగర్ లో కూడారేషన్ సరుకులు ఇప్పించేలా చూడాలని ప్రజలు కోరారు అందులో ఇందిరానగర్ సంబంధించిన కార్డులు సుమారు 70 కలవు. ఇందిరానగర్ నుండి ఆరెగూడెం వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో ప్రయాణ సౌకర్యం లేక రేషన్ సరుకులు తేవడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు రేషన్ డీలర్ అయిన లక్ష్మయ్య సహకారంతో ఇందిరానగర్ లో గల ఎస్సీ కమిటీ హాల్ బిల్డింగ్ లో ఇందిరానగర్ కు సంబంధించిన రేషన్ షాపు ఏర్పాటు చేసి రేషన్ బియ్యం ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ఇందిరానగర్ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

