BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ
09 Mar, 2026 - 02:49 AM
208 వీక్షణలు
సీఆర్ఆర్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది NTODAY NEWS: ఏలూరు జిల్లా ప్రతినిధి కళ్యాణ్ కుమార్ ఏలూరులోని సర్ సీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నగర మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ మహిళల భద్రత, శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. మహిళల భద్రత ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. జిల్లాలో కీలక పదవుల్లో మహిళలు ముందుండి పనిచేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కుటుంబం నుంచి సమాజం వరకు అన్ని రంగాల్లో మహిళలు సమర్థవంతంగా తమ పాత్రను పోషిస్తున్నారని అన్నారు. మహిళలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.245 కోట్ల 42 లక్షల బ్యాంక్ లింకేజ్ రుణాలను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులను కలెక్టర్ వెట్రి సెల్వి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. #InternationalWomensDay #Eluru #CRRCollege #WomenEmpowerment #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube