BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న సిపిఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

తెలంగాణ
07 Jun, 2025 - 09:28 AM
136 వీక్షణలు
ఈనెల 9,10,11 తేదీలలో యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న సిపిఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి --- సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ NTODAY NEWS : తుర్కపల్లి, జూన్ 07 ఈ నెల 9,10,11 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతును జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చారు సిపిఎం తుర్కపల్లి మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేపట్టడానికి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ క్లాసులను నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సాగు,తాగునీరు సమస్యల పరిష్కారం చేయడంలో, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు సక్రమంగా వేయడం లేదని వెంటనే విడుదల చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈనెల 9,10,11 తేదీలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్లాసులలో గ్రామ, మండల, జిల్లా నాయకత్వం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్, మండల కమిటీ సభ్యులు కుక్కొండ లింగయ్య, తలారి మాతయ్య, తూటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube