శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జెవివి కృషి .
NTODAY NEWS:గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి.
శాస్త్ర ప్రచార కృషిలో 38 సంవత్సరాలుగా ప్రజలతో స్నేహ సంబంధులు కొనసాగిస్తూ ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించాలని మానవత్వంతో జీవించాలని ఆకాంక్షిస్తూ శాస్త్ర ప్రచారంతో జన విజ్ఞాన వేదిక ప్రజలను చైతన్యవంతం చేస్తుందని జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యులు ఎం సూర్యనారాయణ వి సత్యనారాయణ రెడ్డి తెలిపారు శనివారం పట్టణంలో నెంబర్ వన్ ప్రాథమిక పాఠశాలనందు జనవిజ్ఞాన వేదిక గొల్లప్రోలు మండల శాఖ సమావేశం అధ్యక్షులు ఏలేటి నాని బాబు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జెవివి నాయకులు మాట్లాడుతూ సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం చాందస భావాలను అరికట్టి ప్రజలు ఎదుర్కొంటారు అనేక సమస్యల మౌలిక స్వరూప స్వభావాలను గూర్చి సమగ్రమైన శాస్త్రీ అవగాహనను పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని తెలిపారు ఈ సమావేశంలో జె వి వి మండల నూతన కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులు దాడి పద్మనాభం ఉపాధ్యక్షులు ఎంవి సత్యనారాయణ అధ్యక్షులు ఏలేటి నాని బాబు ప్రధాన కార్యదర్శి దాసం గోవిందరాజులు చెకుముకి కన్వీనర్ అనిశెట్టి సీతారామరాజు నియమించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమత కన్వీనర్ సిహెచ్ యు ఆర్ మంగతాయారు సిహెచ్ లోవరాజు స్కూల్ ప్రధానోపాధ్యాయులు ధర్మరాజు పాల్గొన్నారు.













