పోగొట్టుకున్న పర్సును తిరిగి భాధితురాలికి అప్పగించిన కైకలూరు పోలీసులు

Spread the love

పోగొట్టుకున్న పర్సును తిరిగి భాధితురాలికి అప్పగించిన కైకలూరు పోలీసులు

NTODAY NEWS: కైకలూరు

ది 12.08.2025 రాత్రి సుమారు 9.50 గంటల సమయంలో, కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామానికి చెందిన శ్రీమతి షేక్ జ్యోతి 26 సంవత్సరాలు, కైకలూరు టౌన్‌లోని వెంకటరమణ థియేటర్ ఎదుట ఆగి ఉన్న ఆటోలో ప్రయాణిస్తుండగా, తన పర్స్ ఆటోలో మర్చిపోయారు. పర్స్‌లో ₹13,000 నగదు, డెబిట్ కార్డు, పాన్ కార్డు, ఏటీఎం కార్డులు, మరియు ఇతర విలువైన పత్రాలు ఉన్నాయి. ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందిన బాధితురాలు వెంటనే కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌ కు సమాచారం అందించారు. కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్‌ఐ శ్రీనివాస్ వెంటనే చర్యలు ప్రారంభించి, కానిస్టేబుల్ కె. నాగార్జున సహకారంతో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆ ఆటోను గుర్తించారు. సంబంధిత ఆటోను ఆపి పరిశీలించగా, పర్స్ సురక్షితంగా దొరికింది. తరువాత పోలీసులు పర్స్‌లోని మొత్తం నగదు మరియు పత్రాలను సురక్షితంగా బాధితురాలికి అందచేసిన విషయంపై బాధితురాలు కైకలూరు టౌన్ పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »