
కేజీబీవీ బాలికలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి: అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
NTODAY NEWS: కరీంనగర్
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న బాలికలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా తీర్చిదిద్దాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు.
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (NIEPA), న్యూఢిల్లీ సహకారంతో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులు, వార్డెన్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఈ శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కేజీబీవీల్లో చదువుతున్న బాలికలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు, తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహించాలని తెలిపారు. కేజీబీవీ బాలికలను అన్ని రంగాల్లో రాణించేలా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులకు బ్యాగులను బహుమతిగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ డైరెక్టర్ డాక్టర్ దేబోర కృపారాణి, యాదాద్రి జిల్లా మాస్టర్ ట్రైనర్లు పగిడిపల్లి నిర్మల, జ్యోతి, కరీంనగర్–జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కేజీబీవీ ప్రత్యేక అధికారులు, వార్డెన్లు పాల్గొన్నారు.













