పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
NTODAY NEWS: మునుగోడు
తన సొంత డబ్బు 12,50000 రూపాయల తో యువకునికి కార్పొరేట్ వైద్యం.కామినేని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స(kidney transplantation Operation) చేయించిన రాజ్ గోపాల్ రెడ్డి.
రాజగోపాల్ రెడ్డి చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటామంటున్న కుటుంబ సభ్యులు
హర్షం వ్యక్తం చేస్తున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలు
మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు నెల్లి గణేష్(26) గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు.. కిడ్నీలు దెబ్బతిన్నాయని కిడ్నీ మారిస్తే కానీ బ్రతకడని డాక్టర్లు చెప్పారు.. కిడ్నీ మార్పిడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని కూడా చెప్పారు.. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు అంత డబ్బు తమ దగ్గర లేకపోవడంతో భగవంతునిపై భారం వేసి రోజులు వెలదీస్తున్నారు.. నెల్లి గణేష్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండడంతో విషయాన్ని స్థానిక నాయకులు మునుగోడు శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.. వెంటనే తన వ్యక్తిగత సిబ్బందిని ఆసుపత్రికి పంపించి కిడ్నీ మార్పిడి చికిత్స చేయడానికి కావలసిన ఏర్పాటు చూడాలని ఆదేశించారు…
12. 50 లక్షల రూపాయలను కామినేని ఆసుపత్రికి చెల్లించి గణేష్ కు కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు.. చికిత్స అనంతరం ఈరోజు కామినేని ఆసుపత్రికి వెళ్లి గణేష్ బాగోగులు తెలుసుకున్నారు.. గణేష్ కుటుంబ సభ్యులకు నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు.. తన కుమారునికి సొంత ఖర్చులతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించి కార్పొరేట్ వైద్యం అందించిన రాజగోపాల్ రెడ్డికి గణేష్ తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరించారు.. నా కుమారునికి పునర్జన్మ ప్రసాదించావన్నారు
నెల్లి గణేష్ కు సొంత ఖర్చులతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించడంతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదార స్వభావానికి సహాయం చేసే గుణానికి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు…

