రెవిన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం, బొమ్మలరామారం మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు
NTODAY NEWS:బొమ్మలరామారం, జూన్ 04
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలు,అన్ని గ్రామాల్లో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి రెవెన్యూ చట్టం రైతులకు మేలు జరుగుతాయని ఈనెల 3 నుండి 19 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. భూభారతి చట్టం అమలు సందర్భంగా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్, మునిరాబాద్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు లను ఎమ్మార్వో పి. శ్రీనివాసరావు ప్రారంభించారు.అనంతరం ఎమ్మార్వో మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సదస్సుల గురించి అన్ని గ్రామాల ప్రజలకు,రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను రైతుల నుండి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శోభ రాణి,ఆర్ ఐ వెంకట్ రెడ్డి, ఏ ఆర్ ఐ నరేష్ నాయక్, ఐలయ్య, నాగార్జున, రాజు, రెవెన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.