భూభారతి చట్టంతోనే భూ సమస్యలు పరిష్కారం
NTODAY NEWS
నల్గొండ స్టాఫ్ రిపోర్టర్ కూనురు మధు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చిట్యాల ఎమ్మార్వో కృష్ణ నాయక్ తెలిపారు. మంగళవారం రోజున
చిట్యాల మండల పరిధిలో పెద్ద కాపర్తి, వట్టిమర్తి గ్రామాలలో భూభారతి చట్టంపై రైతులకు రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాసిల్దార్ కృష్ణా నాయక్ మాట్లాడుతూ భూభారతి చట్టం ప్రతి భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఈ సదస్సులో భాగంగా వట్టిమర్తి గ్రామంలో 41, పెద్ద కాపర్తి గ్రామంలో 46 ఫిర్యాదులు అందాయని తాసిల్దార్ కృష్ణ నాయక్ తెలియజేశారు. ఈ సదస్సులలో డిప్యూటీ తాసిల్దార్ విజయ, నర్రా మోహన్ రెడ్డి, గ్రామాల రైతులు పాల్గొన్నారు.